ASR: ఇటీవల కాఫీ ఎపెక్స్ కమిటీ ప్రకటించిన కాఫీ మద్దతు ధరలను కాఫీ రైతులు వ్యతిరేకిస్తున్నారని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర బుధవారం తెలిపారు. పార్చిమెంట్ కాఫీ కిలో రూ.500, అరబిక్ చెర్రీ కాఫీ కిలో రూ.300, రోబస్ట్ చెర్రీ కాఫీ కిలో రూ.200 చొప్పున మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అరకు ఆర్గానిక్ కాఫీకి అంతర్జాతీయంగా మంచి ధర ఉందన్నారు.