E.G: ఎటపాక మండల తహసీల్దారుగా కారం సుబ్బారావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు దానే రాజు, బొల్లా పుల్లయ్య మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం తహసీల్దారు మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. అలాగే రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.