SKLM : హిరమండలం మండల పరిధికి చెందిన సొర్లంగి గ్రామంలో స్వయం శక్తి మహిళా సంఘాల సభ్యులతో సోమవారం సమావేశం నిర్వహించినట్లు స్థానిక వెలుగు ఏపిఎం పైడి కూర్మారావు తెలిపారు. మహిళల్లో వ్యక్తిగత ఆదాయ అభివృద్ధికి బ్యాంకులలో ఉమెన్ లెండ్ ఎంటర్ప్రైజెస్ రుణాలు మంజూరు అవుతాయని అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం ఉందన్నారు.