KRNL: ఈనెల 9న రాష్ట్ర సీఎం శ్రీశైలం పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. విజయవాడ- శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.