అనంతపురం: కస్తూర్బా గాంధీబాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాలు ఇటీవల పరిశీలించారు. వాటికి సంబంధించిన తాత్కాలిక మెరిట్ జాబితా సమగ్రశిక్ష atp.blagspot.com వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 21న సాయంత్రం 4 గంటలలోపు సమగ్రశిక్షా కార్యాలయంలో తెలియజేవచ్చని ఏపీసీ నాగరాజు తెలిపారు.