SKLM: పాతపట్నం పీహెచ్సీలో స్టాల్స్ ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందించనున్నట్లు ఆసుపత్రి సూపరిండెంట్ కృష్ణారావు సోమవారం తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.