ATP: జిల్లా మహిళల కోసం రూడ్ సెట్ సంస్థ కారు డ్రైవింగ్‌పై అనంతపురంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 20 నుంచి డిసెంబర్ 19 వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండి, రేషన్, ఆధార్ కార్డు కలిగిన నిరుద్యోగులు అర్హులన్నారు. 30 రోజుల ఈ శిక్షణా కాలంలో భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.