GNTR: జిల్లాలో ఆకుకూరల ధరలు అమాంతం పెరిగాయి. ఆకుకూర పంటలు చేతికొచ్చే సమయానికి ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల దిగుబడి తగ్గిపోయింది. దీంతో గుంటూరు నగరంలోని రైతు బజార్లు రూ.10 విక్రయించే ఆకుకూరల కట్టలను.. రకాలను బట్టి రూ.15 నుంచి రూ.60వరకు విక్రయిస్తున్నారు. కొత్తిమీర రూ.50పైనే ధర పలుకుతుండగా.. తోటకూర,పాలకూర లాంటివి రూ. 20వరకు అమ్ముతున్నారు.