W.G: పెనుగొండ గాంధీ బొమ్మల సెంటర్ సమీపంలోని ఓ లాడ్జిలో పేకాడుతున్న 13 మందిని గురువారం అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై గంగాధర్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.40,340 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. పెనుగొండ మండల పరిధిలో పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్సై హెచ్చరించారు.