ASR: కూనవరం మండలంలో 20 రోజులుగా పులి సంచరిస్తున్నట్లు అటవీ, పోలీస్ శాఖ సంయుక్తంగా ధ్రువీకరించడంపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. పులి జాడను ట్రాప్ కెమెరాలతో పట్టేందుకు ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేదు. రాత్రి వేళల్లో ఇరు శాఖల సిబ్బంది కలిసి వాహనాలను చట్టి క్రాస్ రోడ్డు వద్ద పహారా కాస్తూ రాత్రివేళల్లో వాహనాలను వేరే మార్గంలో మళ్లిస్తున్నారు.