SRPT: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఇవాళ జిల్లా కేంద్రంలో అంజనాపురి చౌరస్తా వద్ద అతివేగంతో వచ్చిన ఓ బ్రిజా కారు కల్వర్టును ఢీకొట్టి మూసీ కాల్వలో పల్టీ కొట్టింది. ప్రమాద ధాటికి కారు టైరు ఊడిపోయింది. కారులోని పలువురికి గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.