ప్రకాశం: ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని పండ్ల వ్యాపారులకు ఎస్సై మహేశ్ సూచించారు. శనివారం రాత్రి దోర్నాల పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై ఎస్సై అవగాహన కల్పించారు. పండ్ల వ్యాపారులు పోలీస్ నిబంధనలు పాటించి వ్యాపారాలు నిర్వహించుకోవాలని కోరారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.