VSP: ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రాన్రిక్స్ శాఖా మంత్రివర్యులు నారా లోకేష్ బుధవారం విశాఖ రానున్నారు. ఆయన మంగళవారం రాత్రి విశాఖ వస్తారని ఇక్కడి వర్గాలు ముందుగా భావించాగా, బుధవారం ఉదయం 8.30 గంటల విమానంలో విశాఖలోని పార్టీ కార్యాలయం విశాఖ ఎన్టీఆర్ భవనంకు చేరుకుంటారన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఆర్థిక సదస్సు ముగింపు అనంతరం విశాఖ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారని పేర్కొన్నారు.