చిత్తూరు: వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా పోలేరమ్మ ప్రత్యేకంగా అలంకరించి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జీని గల వారి వీధినుండి అమ్మవారిని అలంకరించి పోలేరమ్మ గుడికి తీసుకువచ్చారు. భక్తజన సందోహం మధ్య జై పోలేరు అంటూ భక్తుల నినాదాలతో అమ్మవారిని గుడికి తీసుకుని వచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.