ఏపీ మంత్రి రోజా కాలినొప్పి, వాపు సమస్యలతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో రాముడి అవతారంలో కనిపించనున్నారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటిస్తున్న తన తదుపరి భారీ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు, నటి మరొక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు మాత్రమే ఇంటికెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో..పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయనే కథాంశంతో మట్టికథ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
టాలీవుడ్ హీరీయిన్ సమంత కెరీర్ లో దూసుకుపోతోంది. ది ఫ్యామిలీ మేన్ సిరీస్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ తో సమంత హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాబోతున్న మరో సిరీస్ ‘‘సిటాడెల్’’ తో మరింత అలరించేందుకు కృషి చేస్తోంది.
ఎంగేజ్‌మెంట్‌లో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కట్టుకున్న శారీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
జనతా గ్యారేజ్, దేవరాయ, అత్తిలి సత్తిబాబు వంటి సినిమాల్లో నటించిన విదిషా శ్రీవాస్తవ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె తన బేబీ బంప్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవికాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక నాగబాబు నివాసంలో ప్రారంభమైంది. మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఒక్కొక్కరే ఈ వేడుకకు హాజరవుతూ వస్తున్నారు. నిశ్చితార్థానికి కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు.
టాలీవుడ్ ట్రెండింగ్ వార్ ఏదంటే.. అనసూయ, విజయ్ దేవరకొండదే అని చెప్పొచ్చు. గత కొంత కాలంగా రౌడీ ఫ్యాన్స్, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతునే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా.. ఇండైరెక్ట్‌గా అనసూయ ఏదో ఒక పోస్ట్ చేయడం.. దానికి కౌంటర్‌గా రౌడీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం కామన్ అయిపోయింది. అయితే తాజాగా ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని చెప్పి షాక్ ఇచ్చింది అనసూయ.
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమా.. ఎంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా వివాదం కొనసాగుతునే ఉంది. ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ పూరి పై కాస్త గట్టిగానే పడింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం అటకెక్కింది. దాంతో విజయ్, పూజా హెగ్డే ఇక కలిసి నటించరు అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ఈ జోడి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీ పెళ్లి వేడుకగా జరిగింది. ఈ వివాహ వేడుకకు జబర్దస్త్ కమెడియన్స్, బుల్లితెర నటీనటులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
మరో సెలబ్రిటీ కపుల్ డైవర్స్ తీసుకుంది. సుష్మిత సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు ఇన్ స్టలో పోస్ట్ చేశారు.
హీరోయిన్ డింపుల్ హయతి తనపై కేసును కొట్టేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రాహుల్ హెగ్డే(DCP Rahul Hegde) అధికార దుర్వినియోగంతో తన డ్రైవర్ చేత తప్పుడు కేసు పెట్టించారంటూ తెలిపింది. తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరింది.
నాగశౌర్య(Naga Shaurya) చివరగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీలో నటించారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు రంగబలి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జులై 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఫహాద్ ఫాజిల్ నటించిన ధూమం సినిమాకు సంబంధించి తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ జూన్ 23న ఐదు భాషల్లో విడుదల కానుంది.