హీరోయిన్ డింపుల్ హయతి తనపై కేసును కొట్టేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రాహుల్ హెగ్డే(DCP Rahul Hegde) అధికార దుర్వినియోగంతో తన డ్రైవర్ చేత తప్పుడు కేసు పెట్టించారంటూ తెలిపింది. తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరింది.
హీరోయిన్ డింపుల్ హయతి(Actress Dimple Hayathi)పై ఈ మధ్యనే పోలీసు కేసు(Police Case) నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే(DCP Rahul Hegde) వాహనంపై దాడి చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. డీసీపీ డ్రైవర్ డింపుల్, ఆమె స్నేహితుడిపై మే 23న ఫిర్యాదు చేయగా వారిపై 353, 341, 279 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ తర్వాత డింపుల్ హయతిని స్టేషన్కి పిలిపించి హెచ్చరించి పంపించేశారు. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్(Hot Topic) అయ్యింది.
తనపై కేసు నమోదైన టైంలో డింపుల్ హయతి(Actress Dimple Hayathi) స్పందించింది. అధికార దుర్వినియోగం చేస్తూ తనపై తప్పుడు కేసు పెట్టారని ఆమె ట్వీట్(Tweet) చేసింది. తాను లీగల్గా ఫైట్ చేస్తానని ఆ సందర్భంగా తెలిపింది. తాజాగా ఆ కేసు విషయంలో డింపుల్ హైకోర్టును ఆశ్రయించింది. తనపై కేసును కొట్టేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రాహుల్ హెగ్డే(DCP Rahul Hegde) అధికార దుర్వినియోగంతో తన డ్రైవర్ చేత తప్పుడు కేసు పెట్టించారంటూ తెలిపింది. తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరింది.
డింపుల్(Actress Dimple Hayathi) వ్యాఖ్యలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్రంగా ఖండించారు. డింపుల్ తన బీఎండబ్ల్యూ కారుతో ఐపీఎస్ ఆఫీసర్ వాహనాన్ని ఢీకొట్టినట్లు కోర్టుకు తెలిపాడు. కారుని ఢీకొన్న ఫోటోలను కూడా ఆయన కోర్టు ముందు ఉంచాడు. సీసీ టీవీ వీడియో(CCTV Video) కూడా తమ వద్ద ఉందని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు(High Court) 41ఏ నిబంధనల ప్రకారంగా డింపుల్ హయతి పట్ల పోలీసులు వ్యవహరించాలని తెలిపింది. అలాగే నోటీసులకు స్పందించి డింపుల్ హయతి ఇన్వెస్టిగేషన్కు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.