స్టార్ హీరోయిన్ ఇలియానా ఆస్పత్రిలో చేరారు. టాలీవుడ్ లో ఈమె దేవదాస్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించి అగ్ర కథానాయికగా పేరు పొందింది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలియానా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను షేర్ చేసింది. చేతికి సెలైన్ తో ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఇలియానాను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చేరిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్నాని, తనకు డాక్టర్లు మూడు బాటిళ్ల సెలైన్స్ ఎక్కించినట్లు ఇలియానా నోట్ లో రాసుకొచ్చింది. ఇలియానా ఫోటోలను చూసి ఫ్యాన్స్ కంగారు పడ్డారు. తన ఫ్యాన్స్ కోసం ఇలియానా మరో నోట్ ను రాసుకొచ్చింది. తన కోసం బాధపడొద్దని, డాక్టర్లు బాగా చికిత్స అందిస్తున్నారని, తనపై ప్రేమ, ఆప్యాయత చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.