Nandamuri Tarakaratna : ఎమోషనల్ వీడియో షేర్ చేసిన తారకరత్న భార్య
నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) ఒంటరైంది. భర్తను మర్చిపోలేక తమ జీవితంలోని గుర్తులను తలచుకుంటూ కాలాన్ని వెల్లదీస్తోంది. తాజాగా ఆమె తన భర్తకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఆ ఎమోషనల్ వీడియో(Emotional video) నెట్టింట వైరల్(Viral) అవుతోంది.
నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) ఒంటరైంది. భర్తను మర్చిపోలేక తమ జీవితంలోని గుర్తులను తలచుకుంటూ కాలాన్ని వెల్లదీస్తోంది. తాజాగా ఆమె తన భర్తకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఆ ఎమోషనల్ వీడియో(Emotional video) నెట్టింట వైరల్(Viral) అవుతోంది. తారకరత్న జీవించి ఉన్నప్పుడు ఇంట్లో తీసిన వీడియోను అలేఖ్య రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. నిన్ను నేను మరచిపోలేకపోతున్నానని ఆ వీడియోకు కామెంట్ యాడ్ చేసింది. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి పోస్టు వైరల్(Viral Post) అవుతోంది.
ఫిబ్రవరి 28న తారకరత్న(Tarakaratna) మరణించిన తర్వాత అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వస్తోంది. తనను ప్రేమ పెళ్లి చేసుకున్న తారకరత్న ఎంతో మానసిక వేదనకు గురయ్యాడని, ఎన్నో అవమానాలను భరించాడని సుదీర్ఘ పోస్టుల ద్వారా అలేఖ్య తెలిపింది. తారకరత్నతో తనకు ఏర్పడిన పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాలను ప్రస్తావించింది.
అయినవాళ్లే తనను, తన భర్తను ఎన్నోసార్లు అవమానించారని, బాధపెట్టారని అలేఖ్య(Alekhya Reddy) అసహనం వ్యక్తం చేసింది. తమ ఇద్దరి పరిచయం ప్రేమగా మారిందని, అయినా కూడా తన మనసులో ఏదో ఎక్కడో సందిగ్ధత ఉండేదని, కానీ తారకరత్న(Tarakaratna) మాత్రం స్పష్టమైన పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉండేవాడని తెలిపింది. కానీ ఆ నిర్ణయమే అందరినీ దూరం చేసిందని, తమను మానసిక ఒత్తిడిని, ఆర్థిక ఇబ్బందులను కలిగేలా చేసిందని, కొందరి ద్వేషాన్ని చూడలేక కళ్లకు గంతలు కట్టుకుని బతికిన క్షణాలను గుర్తు చేసుకుంది.
తాను, తారకరత్న(Tarakaratna) కుటుంబానికి దూరం కావడం వల్ల పెద్ద కుటుంబం కావాలనుకున్నామని, పిల్లలు పుట్టాక తమ జీవితం మారిపోయిందని అలేఖ్య రెడ్డి తెలిపింది. సంతోషం నిండిన తన జీవితంలో రియల్ హీరో తారకరత్న అని అలేఖ్య(Alekhya Reddy) ఎమోషనల్ అయ్యింది. మళ్లీ తామిద్దరం కలుస్తామని అలేఖ్య ఆశించింది. తారకరత్న చనిపోయిన చాలా రోజుల తర్వాత కూడా అలేఖ్య రెడ్డి పోస్టు చేసిన ఈ భావోద్వేగం పోస్టు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. చివరగా మామయ్య బాలకృష్ణ, పెదనాన్న విజయసాయి రెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.