Mahesh Babu : SSMB 28 టైటిల్ & ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది!
Mahesh Babu : అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12 సంవత్సరాలకు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రస్తుతం SSMB 28 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు.
అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12 సంవత్సరాలకు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయ్యింది. ప్రస్తుతం SSMB 28 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా.. మార్చి 22న SSMB28 నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతుందంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరో నాలుగైదు రోజుల్లో దీనిపై అఫీషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరో వైపు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్ స్థాయిలో దర్శక ధీరుడు రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అంతేకాదు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇప్పటికే మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు జక్కన్న. దాంతో నెక్స్ట్ ఆస్కార్ రేంజ్ సినిమా వస్తోంది.. ఇక పై సూపర్ స్టార్, గ్లోబల్ స్టార్ అంటూ.. ట్విట్టర్లో SSMB29ని ట్రెండ్ చేస్తున్నారు మహేష్ అభిమానులు. రాజమౌళి కూడా భారీ బడ్జెట్‌తో ఎక్కడా కంప్రమైజ్ అవకుండా ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఆగష్టులో ఈ సినిమా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదేమైనా.. SSMB 28, SSMB 29 ప్రాజెక్స్ట్తో. మహేష్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనడంలో సందేహమే లేదు.