ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Alluarjun) పుష్ప(Pushpa) సినిమాతో అఖండ విజయాన్ని అందుకున్నారు. బన్నీకి ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన పుష్ప(pushpa) సినిమాకు కొనసాగింపుగా రెండో పార్టు తెరకెక్కుతోంది. రెండో పార్టు 'పుష్ప : ద రూల్'ను కూడా ఫస్ట్ పార్ట్ రేంజ్ కంటే ఎక్కువ స్థాయిలో రూపొందిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Alluarjun) పుష్ప(Pushpa) సినిమాతో అఖండ విజయాన్ని అందుకున్నారు. బన్నీకి ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన పుష్ప(pushpa) సినిమాకు కొనసాగింపుగా రెండో పార్టు తెరకెక్కుతోంది. రెండో పార్టు ‘పుష్ప : ద రూల్’ను కూడా ఫస్ట్ పార్ట్ రేంజ్ కంటే ఎక్కువ స్థాయిలో రూపొందిస్తున్నారు.
డైరెక్టర్ సుకుమార్(Sukumar) పక్కా స్క్రిప్టును రెడీ చేసుకుని షూటింగ్ ను శరవేగంగా పట్టాలెక్కిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లోనే పుష్ప2(Pushpa2) సినిమా షూటింగ్ మొదలైంది. ఇప్పటి వరకూ ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తాజాగా ఇప్పుడు హైదాబాద్ లోని ఎర్రమంజిల్ లో కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. రాత్రి సమయంలో మాత్రమే షూటింగ్ చేస్తున్నారు.
హీరో అల్లు అర్జున్(Alluarjun)తో పాటుగా ఇతర నటులంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయితే విదేశాలకు చిత్ర యూనిట్ వెళ్లనుంది. ఆ తర్వాతి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో సుకుమార్(Sukumar) ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదిన అల్లుఅర్జున్(Alluarjun) పుట్టినరోజు సందర్భంగా రెండో పార్టుకు సంబంధించి ప్రత్యేక గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. మైత్రీమూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్(Devi sri Prasad) ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. రెండో పార్టులో సాయి పల్లవి ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.