Pawan Kalyan: ‘బ్రో’ సెట్స్ పైకి పవన్ ఎంట్రీ.. వీడియో వైరల్
పవన్ కల్యాణ్ రాకతో సెట్స్ పై సందడి వాతావరణం కనిపించింది. ఓ లగ్జరీ వాహనంలో పవన్ సెట్స్ వద్దకు వచ్చారు. పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికి ఆహ్వానించారు.
పవన్ కల్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్ తేజ్(Saidharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ఇటీవల ‘బ్రో'(BRO Movie) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌తో పాటుగా మోషన్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. వీటికి రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. తాజాగా బ్రో సెట్స్ పైకి పవన్ కల్యాణ్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది.
— People Media Factory (@peoplemediafcy) May 20, 2023
పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాకతో సెట్స్ పై సందడి వాతావరణం కనిపించింది. ఓ లగ్జరీ వాహనంలో పవన్ సెట్స్ వద్దకు వచ్చారు. పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికి ఆహ్వానించారు. లాల్చీ, పైజామా డ్రస్ లో ఉన్న పవన్ స్వయంగా వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ రావడం విశేషం. బ్రో చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా జులై 28న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం సెట్స్ లోకి పవన్ అడుగుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.