అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగింది. ఆహా ఓటీటీ వేదికగా ఈ షో సాగుతోంది. ఈ టాక్ షో బాలయ్యను కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిందని చెప్పొచ్చు. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే ఈ షోకు సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రభాస్, గోపిచంద్, శర్వానంద్, అడివి శేష్ వంటి వారితో పాటు మరికొంత మంది వచ్చారు. ఇప్పుడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. షోలో బాలయ్యను పవన్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. వాటన్నింటికీ పవన్ జవాబు చెప్పారు. తాజాగా ఈ ఎపిసోడ్ గురించి మరో వార్త బయటపడింది. ఇందులో పవన్ తో పాటుగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా రానున్నాడు. నల్ల షర్ట్, తెల్ల పంచెతో సాయితేజ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.