Mahesh Babu : మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కాస్త ఎక్కువ. ఏది చేసినా.. సరైన ముహూర్తం చూసుకుంటారు. అలాగే హిట్, ఫట్ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అదే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 విషయంలోను జరుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్‌కు 'అ' సెంటిమెంట్‌లో భాగంగా.. ఈ సినిమాకు అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.
సినీ నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి (Manchu Manoj second marriage) చేసుకోవడం ఆయన ఫ్యామిలీలో కొందరికి ఇష్టం లేదని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తండ్రి, నటుడు మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు.
మంచు కుటుంబంలో విబేధాలు బయటపడినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాలు వెలుగు చూశాయట. తన ఇంట్లోకి జొరబడి తన వాళ్లను, బంధువులను కొడుతున్నారంటూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది.
Vishwak Sen : కేవలం హీరోగానే కాదు దర్శకుడిగాను తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అంతే కాదు తండ్రి కరాటే రాజుతో కలిసి నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు. తనే హీరోగా, దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'దాస్ కా ధమ్కీ' ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది.
Chiru : అర్జున్ రెడ్డితో సంచలన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను బాలీవుడ్‌లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది.
మాస్ మహారాజ రవితేజ(Ravi teja) ఫ్యామిలీ నుంచి టాలీవుడ్(Tollywood)కు ఓ హీరో పరిచయం అవుతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు అయిన మాధవ్(Madhav) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఆ మూవీ తెరకెక్కుతోంది. పెళ్లి సందD సినిమాతో కమర్షియల్‌గా హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణం(Gowri ronamki)కి ఈ సినిమాకు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. తాజాగా ఈ మూవీ...
తాను ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలంటూ కంగనా రనౌత్(Kangana Ranaut) కోరుకుంది. తన శత్రువులు తనను విశ్రాంతి తీసుకోనివ్వకుండా చేశారని, తాను ఎంత విజయం సాధించానన్నది ముఖ్యం కాదని, తనను తన పాదాలపై నిల్చుని విజయ పథంలో నడిచేలా చేశారని, అటువంటి వారందరికీ కృతజ్ఞురాలినని కంగనా రనౌత్ తెలిపారు.
Hero Nani:సినీ ఇండస్ట్రీకి రావాలంటే అంత ఈజీ కాదు.. వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం కష్టమే. కెరీర్ తొలినాళ్లలో అందరూ ఇబ్బంది పడిన వారే.. ఇక హీరో నాని (Hero Nani) గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన సందర్భాలను చాలా సార్లు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మరోసారి రివీల్ చేశారు. ఓ దర్శకుడు (director) తనను అవమానించాడని హాట్ కామెంట్స్ చేశారు.
కామెరూన్ డయాజ్(Cameron Diaz) 1994లో ది మాస్క్(THE MASK) అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అనేక సూపర్ హిట్ మూవీస్ చేసింది. హాలీవుడ్(Hollywood)లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాకుండా హాలీవుడ్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా రికార్డుకెక్కింది. ఇకపోతే చివరిసారిగా 2014లో యానీ అనే హాలీవుడ్ మూవీస్ లో కనిపించింది. ఆ తర్వాత ఆమె మళ్లీ మూవీస్(Movies)కు దూరమైంది.
జబర్దస్త్ కమెడియన్ వేణు(Venu) డైరెక్టర్ గా మారి తీసిన మొదటి సినిమా బలగం(Balagam). కథనంలో కొత్తదనం ఉందని విమర్శకులు సైతం ప్రశంసలు అందిస్తున్నారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ(OTT)లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోతో పాటుగా సింప్లీ సౌత్ ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్స్ లో మార్చి 24 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Prabhas : సాహో, రాధే శ్యామ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ ఇచ్చిన ప్రభాస్.. ఆ లోటును పూడ్చేందుకు.. ఏడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. అంతేకాదు.. బాహుబలితో రెబల్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
Vijay Devarakonda : పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' ఫ్లాప్ తర్వాత అర్జెంట్‌గా ఓ హిట్ కొట్టేయాలని భావించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. కానీ మనోడి ఆశలను ఆవిరి చేసేసింది సమంత. తప్పని పరిస్థితుల్లో ఖుషి మూవీకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.
ఏడాది నుంచి హీరో యష్(Hero Yash) ఎటువంటి సినిమాను అనౌన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. వారిని కూల్ చేస్తూ యష్ స్వయంగా తన తదుపరి సినిమాను త్వరలోనే అనౌన్స్ చేస్తానని తెలిపాడు. అయితే తాజాగా యష్ నటించిన పెప్సీ యాడ్(pepsi Add) అందర్నీ ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజుల నుంచి పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా యష్ కొనసాగుతున్నాడు. తాజాగా ఆయన ఓ రేంజ్ లో పెప్సీ యాడ్ లో కనిపించారు.
ప్రముఖ ఓటీటీ(OTT) సంస్థ ఆహా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్(Web Series)తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హీరో నవదీప్(Navdeep) నటిస్తున్న ఆ వెబ్ సిరీస్ పేరు 'న్యూసెన్స్'(Newsence). భారీ సినిమాలను వరుసగా నిర్మించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు శ్రీపవన్ కుమార్ డైరెక్షన్ చేస్తున్నారు. బిందుమాధవి(Bindhumadhavi) ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది.
Vishwak Sen : అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అందుకే ఈసారి పాన్ ఇండియా లెవల్లో ధమ్కీ ఇచ్చేశాడు విశ్వక్. రిలీజ్‌కు ముందే 'దాస్ కా ధమ్కీ' సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశాడు.