సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మలయాళ హాస్య నటుడు మముక్కోయ(Comedian Mamukkoya) మరణించారు. గత సోమవారం ఏప్రిల్ 24న కేరళ మలప్పురం జిల్లాలో ఫుట్ బాల్ టోర్నమెంటు జరగ్గా ముఖ్య అతిథిగా మముక్కోయ హాజరయ్యాడు. ఆ కార్యక్రమంలో మముక్కోయ ఉన్నట్టుండి కుప్పకూలాడు. దీంతో ఆయన్ని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందించారు.
వైద్యుల చికిత్స అందినప్పటికీ మముక్కోయ(Comedian Mamukkoya) కోలుకోలేకపోయాడు. దీంతో బుధవారం మముక్కోయ తుదిశ్వాస విడిచారు. మముక్కోయ మరణంతో మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 1979లో యాక్టింగ్ కెరీర్ ని మొదలు పెట్టిన మముక్కోయ స్టార్ కమెడియన్ గా మంచి పేరు సాధించారు.
ఇప్పటి వరకూ కమెడియన్ మముక్కోయ(Comedian Mamukkoya) 450కిపైగా సినిమాల్లో నటించారు. మలయాళ ఇండస్ట్రీతో పాటుగా కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమల్లోని సినిమాల్లో మముక్కోయ నటించి మెప్పించారు. ఆయన నటనకు గాను రెండు రాష్ట్రాల అవార్డులను సొంతం చేసుకున్నారు. తెలుగు ఆడియన్స్ కు కూడా రెండు డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయం అయ్యాడు. దుల్కర్ సల్మాన్ నటించిన జనతా హోటల్, మోహన్ లాల్ నటించిన కనుపాప సినిమాల్లో మముక్కోయ(Comedian Mamukkoya) ముఖ్య పాత్రలు పోషించారు.