బాలీవుడ్ (Bollywood) నటి స్వర భాస్కర్ పెళ్లి పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ (Kangana Ranaut)ట్వీట్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhaskar) సీక్రెట్ పెళ్లి చేసుకొని, ఆ విషయాన్ని నిన్న (ఫిబ్రవరి 16) తన ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేసింది.
బాలీవుడ్ (Bollywood) నటి స్వర భాస్కర్ పెళ్లి పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ (Kangana Ranaut)ట్వీట్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhaskar) సీక్రెట్ పెళ్లి చేసుకొని, ఆ విషయాన్ని నిన్న (ఫిబ్రవరి 16) తన ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు, తోటి నటీనటులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖ రాజకీయ యూత్ లీడర్ అయిన ఫహద్ అహ్మద్ (Fahad Ahmed) ని ప్రేమించి వివాహం చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. రాజకీయ వ్యవహారాలతో మొదలైన వీరిద్దరి స్నేహం, అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు చేరింది.
గత కొంతం కాలంగా సీక్రెట్ రిలేషన్ షిప్ మెయిన్టైన్ చేస్తూ వస్తున్న వీరిద్దరూ జనవరి 6న రిజిష్టర్ మ్యారేజ్ (marriage) చేసుకొని ఒకటయ్యారు.అయితే ఆ విషయాన్ని మాత్రం నిన్న అందరికి తెలియజేసింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక కోర్టులో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒకటైనట్లు తెలియజేస్తూ ఒక వీడియోని విడుదల చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు, తోటి నటీనటులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ (Fire brand) కంగనా రనౌత్ కూడా ట్వీట్ చేసింది.
గతంలో కంగనా, స్వర భాస్కర్ కలిసి ‘తను వెడ్స్ మను’ 1-2 సినిమాల్లో నటించారు.కాగా 2020లో కంగనా.. స్వర మరియు తాప్సీ పన్ను పై తీవ్ర విమర్శలు చేసింది. వారిద్దర్నీ బి-గ్రేడ్ నటీమణులు అంటూ కామెంట్లు చేసింది. ఆ వ్యాఖ్యలతో ఆ సమయంలో కంగనా, స్వర భాస్కర్ మధ్య ట్విట్టర్ (Twitter) వార్ జరిగింది. తాజాగా ఇప్పుడు స్వర చెప్పిన పెళ్లి శుభవార్త (good news) కు కంగనా స్పందింస్తూ.. “పెళ్లిళ్లు (weddings) మనసుకి సంబంధించింది, మిగిలినవి అన్ని ఫార్మాలిటీస్. మీ ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఆ దేవుడు ఆశీర్వాదాలు మీకు కలగాలి” అంటూ ట్వీట్ చేసింది. స్వర భాస్కర్ తో గొడవ తరువాత కంగనా ఆమె పై పాజిటివ్ ట్వీట్ వెయ్యడంతో ప్రస్తుతం బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
Three cheers for the #SpecialMarriageAct (despite notice period etc.) At least it exists & gives love a chance… The right to love, the right to choose your life partner, the right to marry, the right to agency these should not be a privilege.@FahadZirarAhmad ✨✨✨♥️♥️♥️ pic.twitter.com/4wORvgSKDR