ప్రస్తుతం సూరరై పొట్రు హిందీ రీమేక్‌లో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ సుధా కొంగర(Sudha Kongara)కు షూటింగ్లో భాగంగా ప్రమాదం జరిగింది. దీంతో తన ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. ఈ మేరకు విషయన్ని ఆమె చేయికి గాయమైన చిత్రాన్ని పంచుకుంటూ ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్యులు తనను నెల రోజుల పాటు విరామం తీసుకోమన్నట్లు పేర్కొన్నారు.
సూరరై పొట్రు హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్, రాధికా మదన్ నటిస్తున్నారు. వీరు సూర్య, అపర్ణ బాలమురళి పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఒరిజినల్‌కి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు.
తెలుగు చిత్రం ఆంధ్ర అందగాడు (2008)తో సుధా కొంగర దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత గురు, ఆకాశమే నీ హద్దురా వంటి హిట్టు చిత్రాలకు దర్శకత్వం వహించింది. అంతేకాదు ఇటీవల 68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్ ప్లేతో సహా ఐదు అవార్డులను గెలుచుకుంది.