సరైన కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవ్వడం పక్కా. ఈ మధ్యకాలంలో అలా వచ్చిన ప్రేమకథా చిత్రాలు చాలానే హిట్ అయ్యాయి. తాజాగా అలాంటి ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వంలో ‘బుట్టబొమ్మ’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో సూర్య వశిష్ట, అనిఖ సురేంద్రన్ హీరోహీరోయిన్లుగా కనిపిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను మొదట జనవరి 26వ తేది విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే తాజాగా ఆ డేట్ వాయిదా వేసింది. ఫిబ్రవరి 4వ తేది ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దానికి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితమే రిలీజ్ చేసింది.