Allu arjun: ప్రభాస్ సినిమాతో అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ఓపెనింగ్!
టాలీవుడ్ హీరోలు.. కేవలం హీరోలుగా మాత్రమే కాదు బిజినెస్ పరంగాను దూసుకుపోతున్నారు. దేశ విదేశాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే కమర్షియల్‌గా రెండో చేత్తో గట్టిగానే వెనకేసుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా రేసుగుర్రంలా పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు మల్టీప్లెక్స్ నిర్మాణంలోను అడుగు పెట్టాడు. ఆ మల్టీ ప్లెక్స్‌ను ప్రభాస్ కొత్త సినిమాతో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి వారు ప్రొడక్షన్స్ హౌజ్‌లతో పాటు.. పలు వ్యాపారాలు చేస్తున్నారు. పలు బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే మహేష్ బాబు పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏఎంబీ సినిమాస్. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇదే నంబర్ వన్ మల్టీప్లెక్స్ అని చెప్పొచ్చు. ఈ విషయంలో మహేష్‌ను ఫాలో అవుతున్నారు కొంతమంది హీరోలు. విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ రంగంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రెడీ అవుతోంది.
హైదరాబాద్ సత్యం థియేటర్ ప్లేస్‌లో ‘ఏఏఏ’ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ లాంచింగ్‌కు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని సమాచారం. ఈ మల్టీప్లెక్స్‌ను ప్రభాస్ కొత్త సినిమాతో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 16న ‘ఆదిపురుష్’ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అత్యధిక స్క్రీన్స్‌లలో రిలీజ్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో.. బన్నీ కొత్త మల్టీప్లెక్స్‌ను ఆదిపురుష్ సినిమాతో లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.