Movies: దగ్గుబాటి, బెల్లంకొండ బ్రదర్స్ హిట్ కొడతారా!?
నెక్స్ట్ మంత్ ఆదిపురుష్ వచ్చే వరకు చిన్న సినిమాలదే హవా. ఈ వారం ఏకంగా పది సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ నాలుగైదు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వాటిలో ఓ రెండు సినిమాలు మాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోలు స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారే. ఒకరు డెబ్యూ హీరో కాగా.. ఇంకొకరు మాత్రం సెకండ్ సినిమాతో రాబోతున్నాడు. వారేవరో కాదు.. దగ్గుబాటి హీరో అభిరాం, బెల్లంకొండ గణేష్.
స్వాతి ముత్యం సినిమా(Swathimutyam Movie)తో ఓకె అనిపించుకున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్(Bellamkonda Ganesh).. జూన్ 2న ‘నేను స్టూడెంట్ సార్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సతీష్‌వర్మ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు గణేష్. ఈయన అన్న బెల్లంకొండ శ్రీనివాస్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అల్లుడు శీను సినిమాతో హీరోగా మారిన శ్రీనివాస్.. రీసెంట్గా ఛత్రపతి రీమేక్‌తో హిందీలో అడుగు పెట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. దాంతో తమ్ముడైనా హిట్ కొడతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక దగ్గుబాటి సురేష్ బాబు రెండో కొడుకు, రానా తమ్ముడు అభిరామ్(Daggubati Abhiram) హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘అహింస’. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. ఫ్లాపుల్లో ఉన్న తేజతో పాటు అభిరాంకు ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారింది. బాహుబలితో భళ్లాల దేవగా రానా పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు. కానీ చివరగా విరాట పర్వం సినిమాతో మెప్పించలేకపోయాడు. దీంతో తమ్ముడు అభిరాం ఫస్ట్ సినిమాతో హిట్ అదుకుంటాడా? అన్నలాగే స్టార్ డమ్ తెచ్చుకుంటాడా? అనేది వేచి చూడాల్సిందే. అయితే అహింసతో పాటు నేను స్టూడెంట్ సర్ సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలతోనే థియేటర్లోకి వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్‌కు లేవు కాబట్టి.. ఈ రెండు సినిమాలకు ఇదే కరెక్ట్ టైం అని చెప్పొచ్చు. పైగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో ఇద్దరి సినిమాలకు మంచి టాక్ వస్తే.. వీకెండ్ వరకు అనుకున్నదానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టొచ్చు. మరి ఈ సినిమాల మౌత్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.