పుష్ప ఎక్కడ? అంటూ.. మూడు నిమిషాల వీడియోతో అంచనాలన్నీ తారుమారు చేశాడు సుకుమార్. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించింది. దాంతో పుష్ప2 పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో పుష్పరాజ్‌తో సై అంటోంది అనసూయ అలియాస్ దాక్షాయని.
పుష్ప మూవీ(Pushpa Movie) ఊహించని విధంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు పుష్పరాజ్. తెలుగులో కంటే నార్త్‌లోనే భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో సుకుమార్(sukumar), బన్నీ నెక్స్ట్ లెవల్ అనేలా పుష్ప సెకండ్ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే సుక్కుకి అన్‌లిమిటేడ్ బడ్జెట్ ఇచ్చేశారు. ప్రస్తుతం చిత్తూరులోని స్వర్ణముఖి నదీ తీర ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పార్ట్ వన్‌లో వీళ్ల క్యారెక్టర్స్ హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా అనసూయ(Anasuya) దాక్షాయనిగా అదరగొట్టేసింది. సుకుమార్(Sukumar) తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా షాక్ ఇచ్చిన అనసూయ.. పుష్ప మూవీలో పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించింది. మంగళం శ్రీను భార్యగా, దాక్షాయణి పాత్రలో నటించింది. అయితే పార్ట్ వన్‌లో మంగళం శీనునే భయపెట్టించినా దాక్షాయని.. సెకండ్ పార్ట్‌లో మరింత పవర్‌పుల్‌గా కనిపించబోతోంది. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయింది అనసూయ.
తాజాగా మేకప్ రూమ్‌లో దాక్షాయణి పాత్రకు రెడీ అవుతూ తీసుకున్న మిర్రర్ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి ‘పుష్ప: ది రూల్’ అనే క్యాప్షన్‌తో ఫైర్ ఎమోజీస్ యాడ్ చేసింది. దీంతో అల్లు అర్జున్(Alluarjun), అనసూయ(Anasuya) మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఏ రేంజ్లో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి మధ్య వార్ పీక్స్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి పుష్ప2(Pushpa2 Movie) ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.