పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తొలిప్రేమ సినిమా(Toliprema Movie) 25 వసంతాలను పూర్తి చేసుకుంది. పవర్ కెరీర్లోనే ఈ చిత్రం మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది. ఈ మూవీతో పవన్ క్రేజ్ అమాంతం పెరిగింది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీని రీరిలీజ్(Rerelease) చేశారు. కరుణాకరన్ దర్శకత్వం(Director Karunakaran)లో రూపొందిన ఈ సినిమాలో కీర్తి రెడ్డి(Keerthy reddy) హీరోయిన్గా నటించింది. పవన్ చెల్లెలిగా వాసు(Actress vasuki)కి నటించి మెప్పించింది. ఈ మూవీలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
‘తొలిప్రేమ’ రీరిలీజ్ (Toliprema Rerelease) సందర్భంగా డైరెక్టర్ కరుణాకరన్(Director Karunakaran) పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిలో ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. తొలిప్రేమ సినిమాను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitab bachan), ఆయన భార్య జయా బచ్చన్(Jaya bachan) కలిసి చూశారన్నారు. అయితే ఆ మూవీ క్లైమాక్స్ చూసి అమితాబ్ బచ్చన్‌కి చాలా చిరాకేసిందని కరుణాకరన్ తెలిపారు.
క్లైమాక్స్(Climax)లో హీరో తన ప్రేమ విషయాన్ని చెప్పలేక మదనపడుతుండగా అది చూసిన బిగ్ బీకి ఒక్కసారిగా కోపం వచ్చిందట. ఆ కోపంతో తన కారు తాళంచెవిని స్క్రీన్ మీదకు విసిరేశారట. అయితే ఆ తర్వాత హీరోయిన్ తిరిగి హీరో వద్దకు ఎప్పుడైతే పరుగెట్టుకుని వస్తుందో అప్పుడు బిగ్ బీ పక్కనున్న జయా బచ్చన్ సంతోషంతో చప్పట్లు కొట్టారట. ఈ విషయాన్ని అమితాబ్(Amitab bachan) చెన్నైలో గుర్తు చేసుకుని చెప్పారని కరుణాకరన్ తెలిపారు.
రీరిలీజ్(Rerelease) సందర్భంగా కరుణాకరన్(karunakaran) ఈ విషయాలను గుర్తు చేసుకుని ఇంటర్వ్యూల్లో తెలిపారు. పవన్ మొదట చిరంజీవి(Megastar Chiranjeevi) తమ్ముడిగానే ఇండస్ట్రీకి వచ్చినా ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. గోకులంలో సీత, సుస్వాగతం వంటి సినిమా పవన్ స్థాయిని పెంచాయని, తొలిప్రేమ(Toliprema) సక్సెస్‌తో పవన్ రేంజ్ మారిపోయిందని కరుణాకరన్ తెలిపారు. ఈ మూవీకి సీక్వెల్ కూడా తీస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.