Google Pay Payment Issues : ఇటీవల కాలంలో చిన్న చిన్న చెల్లింపుల నుంచి పెద్ద చెల్లింపుల వరకు చేయడానికి అంతా గూగుల్ పేని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ మధ్య పేమెంట్ ఫెయిల్ కావడం, డబ్బులు క్రెడిట్ కాకపోవడం లాంటి సమస్యలు తరచుగా ఎదురవుతూ ఉంటున్నాయి. మీరూ ఈ సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లయితే తప్పకుండా ఈ టిప్స్‌ని ఫాలో అయి చూడండి.
మీరు చిన్న దుకాణాల దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్ల వరకు పేమెంట్లను చేసేందుకు గూగుల్ పేని వాడుతుంటారు కదా. అలా చెల్లింపులు చేసే సమయంలో ఇంటర్నెట్ సిగ్నల్ స్ట్రాంగ్‌గా ఉందో లేదో ముందుగానే నిర్ధారించుకోండి. ఒక వేళ సిగ్నల్ వీక్‌గా ఉన్నట్లయితే పేమెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బలంగా ఉన్నప్పుడు మాత్రమే పేమెంట్ని కొట్టండి.
ఒక్కోసారి ఇంటర్నెట్ సిగ్నల్ బాగున్నా సరే సర్వర్ బిజీ అని వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మళ్లీ మళ్లీ ప్రయత్నించడం అనవసరం. మీ గూగుల్ పేకి(google pay) మీకున్న రెండు మూడు బ్యాంక్ ఖాతాలను ముందే లింక్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఒక బ్యాంక్ సర్వర్ బిజీగా ఉంటే మరో బ్యాంక్ నుంచి చెల్లింపులు చేసుకునే వీలు ఉంటుంది. అలాగే ఒక్కోసారి డబ్బులు మన ఖాతాలోంచి డెబిట్ అయిపోతాయి. అవతలి వారి ఖాతాలో జమ కావు. అప్పుడు చాలా మంది కంగారు పడుతుంటారు. ఇలాంటి సందర్భంలో గూగుల్ పే 48 గంటల్లో డబ్బును రిఫండ్ చేస్తుంది. అలా కాని పక్షంలో ఈ సమస్యకు సంబంధించి గూగుల్ పే టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే వారు సమస్యను పరిష్కరిస్తారు.