AP: నక్సల్ రహిత దేశంగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు కనీస స్వేచ్ఛ లేదని, వారిని మానసిక క్షోభకు గురిచేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడవిలో ఆకులు తిన్నప్పుడైనా వారు స్వేచ్ఛగా ఉండేవారని పేర్కొన్నారు. సరెండర్ అయిన వారికి సీపీఐ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.