TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఇవాళ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు బుధవారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇవాళ, రేపు HYDలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.