నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు కూడా భారీ జనసందోహం మధ్య కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే రెండో రోజు పాదయాత్ర ప్రారంభం అయింది. పేస్ వైద్య కళాశాల నుంచి ప్రారంభం అయింది. అక్కడి నుంచి బెగ్గిలిపల్లె దగ్గర లోకేశ్ ప్రసంగించారు. ఆ తర్వాత కడపల్లెలో ఇంటరాక్షన్, అక్కడి నుంచి కలమలదొడ్డిలో ఇంటరాక్షన్ అయిపోయాక.. అక్కడి నుంచి శాంతిపురం క్యాంపు వద్ద రెండో రోజు పాదయాత్ర ముగిసింది.
అద్భుత ప్రజాస్పందన, అపూర్వ జనాదరణతో ప్రారంభమైన @naralokesh గారి యువగళం పాదయాత్ర రెండవ రోజు షెడ్యూల్ ఇది. ప్రజలారా తరలి రండి! ఈ పాదయాత్రలో భాగస్వాములవ్వండి. మీ సమస్యలను వినిపించండి. 'యువగళం' పాదయాత్రలో పాల్గొనదలిచినవారు 096862 96862 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి pic.twitter.com/Q2UHnxHNvx
ఈరోజు పాదయాత్రలో నారా లోకేశ్ వెంట భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా బెగ్గిలపల్లి గ్రామపంచాయితీలో అసంపూర్తిగా ఉన్న కురుబ, వాల్మీకి కమ్యూనిటీ హాల్స్ ను నారా లోకేశ్ పరిశీలించారు. తమ సమస్యలను స్థానికులు లోకేశ్ కు విన్నవించారు. చంద్రబాబుపై కక్షతోనే బీసీలను సీఎం జగన్ వేధిస్తున్నారని వాళ్లు వాపోయారు.
ఈరోజు పాదయాత్రలో యువతతో పాటు వృద్ధులు, చిన్నారులు కూడా భారీగా తరలి వచ్చారు. అందరితో లోకేశ్ ఆప్యాయంగా మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగి వారి బాధలు విన్నారు. ఆ తర్వాత కురుబ సమావేశంలో నారా లోకేశ్ ప్రసంగించారు. ఏదైనా ఉంటే చంద్రబాబు మీద తీర్చుకోండి కానీ కురుబల మీద చూపించడం ఏంటి అంటూ సైకో ప్రభుత్వాన్ని నారా లోకేశ్ నిలదీశారు.
బెగ్గిలపల్లి గ్రామపంచాయితీలో అసంపూర్తిగా ఉన్న కురుబ, వాల్మీకి కమ్యూనిటీ హాల్స్ ను పరిశీలించిన శ్రీ నారా లోకేష్. తమ సమస్యలను లోకేష్ గారితో విన్నవించుకున్న స్థానికులు, చంద్రబాబు గారిపై కక్షతోనే బీసీలను సీఎం జగన్ వేధిస్తున్నారన్నారు. pic.twitter.com/CWJwhGamj7
యువగళం పాదయాత్రలో భాగంగా కుప్పంలో జరిగిన కురుబ సమావేశంలో నారా లోకేష్ గారి ప్రతి మాట ఈలలు వేయించుకుంది. చప్పట్లు కొట్టించుకుంది. కక్ష ఉంటే చంద్రబాబుగారి మీద తీర్చుకోవాలి కానీ కురుబల మీద చూపించడం ఏంటి అని సైకో ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.#LokeshinKuppam#YuvaGalampic.twitter.com/TxV8z7dQIF