»Google Vice President Chandrasekhar Thota Had A Crucial Meeting With Cm Revanth Reddy
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కీలక భేటీ
రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఙాన వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై వారి మధ్య చర్చసాగింది. ప్రభుత్వం కలిసి పనిచేయడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు.
Google Vice President Chandrasekhar Thota had a crucial meeting with CM Revanth Reddy
Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రహదారి భద్రతలో సాంకేతికతను జోడించి ప్రయాణికులకు మరింత సులభతరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) గూగుల్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట(Chandrasekhar Thota) గురువారం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చూస్తోందని, ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సుముఖత చూపించారు.
ఈరోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిరంగాన్ని ప్రభావితం చేస్తోందని.. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో డిజిటలైజేషన్ అజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం అవడవం, తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించేందుకు విస్తృతమైన సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద వున్నాయని ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ వివరించారు. ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్స్(Google Maps), గూగుల్ ఎర్త్ ప్లాట్ ఫామ్ల ద్వారా సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.