Yatra 2: ‘యాత్ర2’ టీజర్.. చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుంది!
ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 రాబోతోంది. ఏపిలో వచ్చే ఎలక్షన్స్ టార్గెట్‌గా రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
Yatra 2: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకుడు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా.. 2019లో రిలీజ్ అయి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి బాగా కలిసొచ్చింది. అందుకే ఇప్పుడు 2024 ఎన్నికలని టార్గెట్ చేస్తూ ‘యాత్ర 2’ సినిమాని రెడీ చేస్తున్నారు. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా కనిపిస్తుండగా.. కోలీవుడ్ హీరో జీవా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే యాత్ర 2 మూవీని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే యాత్ర 2 మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
ఇక ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వై.ఎస్.జగన్ రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటి? అనేది ఈ టీజర్లో చూపించారు. ఓదార్పు యాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. మరి వైఎస్. ఆ అడ్డంకులను జగన్ ఎలా అధిగమనించారు.. ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే ‘యాత్ర 2’లో ప్రధాన కథగా కనిపిస్తోంది.
ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ సినిమాను యువీ సెల్ల్యులాయిడ్స్, త్రీ ఆటుమైన్ లీఫ్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే.. యాత్ర సినిమాను ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన తేదీనే.. ఇప్పుడు ‘యాత్ర 2’ని కూడా ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నారు. మరి యాత్ర2 ఎలా ఉంటుందో చూడాలి.