»Trivikrams True Form Is This Poonam Kaur Comments
Poonam Kaur: త్రివిక్రమ్ నిజ స్వరూపం ఇదే
త్రివిక్రమ్ ఏం చేసిన పరిశ్రమలో చెల్లుతుంది. ఆయన వెనుక ప్రభుత్వం కూడా ఉందని నటి పూనమ్ కౌర్ కామెంట్ చేసింది. గుంటూరు కారం రీమెక్ అనే వివాదంపై పూనమ్ తన ఎక్స్ యాప్లో స్పందించింది.
Trivikram's true form is this.. Poonam Kaur comments
Poonam Kaur: తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా పాపులారిటీ మాత్రం విపరీతంగా సంపాదించుకుంది గ్లామరస్ బ్యూటీ పూనమ్ కౌర్(Poonam Kaur). ఎప్పుడూ ఏదో వివాదాల్లో కనిపించే ఈ నటీ తాజాగా త్రివిక్రమ్ పై చేసిన వ్యాఖ్యలు పరిశ్రలో తీవ్ర దూమారం రేపుతున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్నా తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మహేష్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా గుంటూరు కారం(Gunturu Karam) రిమేక్ ఫిల్మ్ అని రాసుకొచ్చింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) తెరకెక్కించిన చాలా సినిమాలు ఇతర సినిమాలు, పుస్తకాల నుంచి కాపీ చేసినవే అని చాలా మంది వాదన. గతంలో మహేష్ బాబుతో తెరకెక్కించిన అతడు సినిమాలో.. పీర్ సాహేబ్ ఘోరిపై నిమ్మకాయలు పెట్టే కాన్సెప్ట్ శీల వీర్రాజు మైన నుంచి తీసుకున్నట్లు, అలాగే సులోచన రాణి నవల మీనా ఆధారంగా అ ఆ సినిమాని తెరకెక్కించారు. అప్పట్లో టైటిల్స్ లో సులోచన రాణి కి క్రెడిట్ ఇవ్వలేదు అని కేసు కూడా ఫైల్ అయింది. ఆ తరువాత కూడా ఇంటిదొంగ చిత్రాన్ని ఆధారంగా తీసుకొని అలా వైకుంఠపురంలో సినిమా తీశారని, పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన అజ్ఙాత వాసి చిత్రం ఒక ఫ్రెంచి చిత్రం ప్రేరణ పొందారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ బాబుతో తెరకెక్కుతున్న గుంటూరు కారం కూడా సులోచనా రాణి నవల కీర్తి కిరీటాలు ఆధారంగా తెరకెక్కించినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి.
త్రివిక్రమ్ విషయంలో పూనమ్ కౌర్ ఒంటి కాలుమీద లేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక నెట్టింట్లో ఈ రీమెక్ వార్త వైరల్ అవడంతో ఆమె రంగంలోకి దిగింది. తన ఎక్స్ యాప్ వేదికగా తీవ్రమైన కామెంట్ చేసింది. త్రివిక్రమ్ ఏమైన చేయగలడు, చేసి తప్పించుకోగలడు. ఆయన ఏం చేసినా చెల్లుతుంది. ఎలాగో ఆయన్ను వెనుకేసుకురావడానికి ఆయనకంటూ ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు ఆయనకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉందని, సాధారణ ప్రజల సమస్యలు తీర్చడానికి గవర్నమెంట్ కు సమయం ఉండదు కానీ, ఆయనకు మాత్రం బాగా సహాయం చేస్తుంది అని, లాస్ట్ లో హ్యాష్ ట్యాగ్ గురూజి అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
He can do anything and get away with it – and there is privileged blindness which people would have for his wrong doings – always wondered why he had such exclusive CMs office for the earlier govt – which general public did not have to resolve their issues – #guruji things ! https://t.co/YbTFPo4SNH