»Amala Nagarjuna Meeting Cm Revanth Reddy Video Viral
Nagarjuna: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమల-నాగార్జున.. వీడియో వైరల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అక్కినేని నాగార్జున, అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
Amala-Nagarjuna meeting CM Revanth Reddy.. Video viral
Nagarjuna: ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జున(Nagarjuna) శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. ఆయన భార్య అక్కినేని అమల(Akkineni Amala)తో కలిసి జూబ్లిహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు వెల్లడించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చిరంజీవితో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు కలిశారు. తాజాగా నాగార్జున దంపతులు సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.