»Vijayakanth I Cant Bear The Death Of Captain Borumanna Vishal
Vijayakanth: కెప్టెన్ మృతిని తట్టుకోలేకపోతున్నాను.. బోరుమన్న విశాల్
తమిళ ఇండస్ట్రీకి కెప్టెన్గా ఉన్న వెటరన్ స్టార్ హీరో.. ది కెప్టెన్ విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు.. ఇటీవలే కరోనా బారిన పడడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో తమిళ సినీ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు విజయకాంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. హీరో విశాల్ మాత్రం జీర్చించుకోలేయాడు.
Vijayakanth: ది కెప్టెన్గా ఎన్నో సినిమాలు చేసిన విజయ్ కాంత్.. హిందీ, తెలుగులోను రీమేక్ అయ్యాయి, డబ్ అయ్యాయి. కానీ ఇతర భాషల్లో స్ట్రెయిట్ సినిమా మాత్రం చెయ్యలేదు. పోలీస్ అధికారం, కెప్టెన్, కెప్టెన్ ప్రభాకరన్, మరణ మృదంగం, పదవీ ప్రమాణం, రౌడీ నాయకుడు, ఇండియన్ పోలీస్, క్రోధం, రౌడీలకి రౌడీ, సెక్యూరిటీ ఆఫీసర్, మా బావ బంగారం, బొబ్బిలి రాయుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యాడు విజయ్ కాంత్. దీంతో విజయకాంత్ మరణ వార్త విని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా శోకసంద్రంలో మునిగాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయకాంత్ మరణం పట్ల స్పందించారు. ‘విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి. విజయకాంత్ కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.. అంటూ సుధీర్ఘ లెటర్ రాశారు పవన్. ఇక తాజాగా హీరో విశాల్.. కెప్టెన్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ.. ఒక వీడియోను రిలీజ్ చేశాడు.
‘నా జీవితంలో.. నేను కలిసిన అత్యంత ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరైన కెప్టెన్ విజయ్ కాంత్ అన్న మరణవార్త విన్న తర్వాత.. నాకు కాళ్లుచేతులు ఆడలేదు. కెప్టెన్ లేడు.. అన్న మాట ఉహించుకోలేకపోతున్నాను. ఆయన నుంచి నేను సామజిక సేవ నేర్చుకున్నాను. కానీ మిమ్మల్ని చివరిసారి చూడడానికి అక్కడ లేనందుకు చింతిస్తున్నాను.. అని వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ అమెరికాలో ఉన్నాడు. అందుకే.. కెప్టెన్ను కడసారి చూపు చూడలేకపోయానని బోరుమన్నాడు విశాల్.