పుష్ప2 తర్వాత భారీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే రెండు సినిమాలు అనౌన్స్ చేయగా.. ఇప్పుడు మరో మాస్ ప్రాజెక్ట్ ఓకె అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నార
Allu Arjun: పుష్ప పార్ట్ వన్ను మించి సెకండ్ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. వెయ్యి కోట్లు టార్గెట్ చేసిన బన్నీ, సుకుమార్.. పుష్ప2ని ఊహకందని విధంగా డిజైన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్పరాజ్ థియేటర్లోకి రాబోతున్నాడు. ఇక పుష్ప తర్వాత రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు బన్నీ. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ సినిమాల నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చేశాడు.
ముందుగా త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసి.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు బన్నీ. అయితే.. ఈ సినిమాలతో పాటు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మళ్లీ ఇప్పుడు ఈ క్రేజీ కాంబోకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అట్లీ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చిత్ర యూనిట్ మీద ప్రశంసల వర్షం కూడా కురిపించాడు అల్లు అర్జున్. దీంతో బన్నీతో అట్లీ కన్ఫామ్ అనుకున్నారు.
అట్లీ కూడా జవాన్ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో.. ఇప్పుడు దాదాపుగా బన్నీతోనే సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసుకున్నాడట అట్లీ. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండబోతుందని.. వచ్చే ఏడాదిలో షూటింగ్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. బన్నీతో అట్లీ ఎలాంటి సినిమా చేస్తాడు? ఐకాన్ స్టార్ పాన్ ఇండియా క్రేజ్‌కు తగ్గట్టుగా చేస్తాడా? అనేది, ఆసక్తికరంగా మారింది.