‘లైగర్’ సినిమాపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకే రిలీజ్‌కు ముందు.. రిలీజ్ తర్వాత భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. కానీ ‘లైగర్’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది. దాంతో రౌడీకి మూడేళ్లుగా ఆశ చూపిన పాన్ ఇండియా స్టార్ డమ్.. దగ్గరికొచ్చినట్టే వచ్చి దూరమై పోయింది. ఇక లైగర్ రిజల్ట్‌తో ఒక్కసారిగా డీలా పడిపోయాడు రౌడీ. అంతేకాదు ఇప్పటికే పూరి జగన్నాథ్‌తో కమిట్ అయిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఇదే విషయాన్ని అడిగితే మాట దాటేస్తున్నాడు విజయ్. అలాగే సోషల్ మీడియాలో రౌడీ యాక్టివిటీస్ కూడా తగ్గిపోయాయి. దాంతో లైగర్ ఎఫెక్ట్ విజయ్ పై భారీగానే పడిందనుకున్నారు. కానీ మళ్లీ రౌడీ రచ్చ మొదలైపోయింది.
రీసెంట్గా సైమా అవార్డ్స్ వేడుకలో ఓ రేంజ్లో సందడి చేశాడు విజయ్. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తు ‘ సింగిల్ ప్లేయర్’ అంటూ కామెంట్ పెట్టాడు రౌడీ. దాంతో దానికి నానార్థాలు తీస్తున్నారు నెటిజన్స్. సింగిల్ ప్లేయర్ అంటే ఏంటి.. ప్రస్తుతం తనతో టచ్‌లో ఉన్న వారితో రిలేషన్ కట్ చేసుకున్నాడా.. అసలు ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడని అడుగుతున్నారు అభిమానులు. అయితే మెజారిటి పీపుల్ మాత్రం.. ఇకపై సోలోగా తన ఆట తానే ఆడుకోవాలని విజయ్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు. మొత్తంగా ఈ సింగిల్ ప్లేయర్ గురించి రకారకాల ట్రోల్ చేస్తున్నారు జనాలు. అయితే ఇదంతా చూస్తుంటే విజయ్ ‘లైగర్’ ఎఫెక్ట్ నుంచి బయటకు వచ్చినట్టేనని చెప్పొచ్చు.