Prashanthకు అండగా నిలిచిన బిగ్ బాస్ చాణక్య.. అతని తప్పేం లేదంటూ
పల్లవి ప్రశాంత్ తప్పేం లేదని చాణక్య శివాజీ అంటున్నారు. చట్టాన్ని గౌరవించాడు కాబట్టే.. జైలుకు వెళ్లాడని.. సోమవారం లోపు బెయిల్ మీద బయటకు వస్తాడని చెబుతున్నారు.
Pallavi Prashanth: బిగ్ బాస్ హౌస్‌లోనే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు (Pallavi Prashanth) చాణక్య శివాజీ అండగా నిలిచారు. చట్ట ప్రకారమే ప్రశాంత్ బయటకు వస్తాడని చెబుతున్నారు. ప్రశాంత్ గురించి వ్యతిరేకంగా కామెంట్స్ చేయొద్దని కోరారు. పారిపోయాడనే కథనాలు వచ్చాయి. ఇలా తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని కోరారు.
హౌస్‌లో ప్రశాంత్‌తో (Prashanth) తాను 100 రోజులకు పైగా ఉన్నానని.. అతను ఎలాంటి వాడో, వ్యక్తిత్వం ఎలాంటిదో తనకు పూర్తిగా తెలుసు అని చెప్పారు. చట్టాన్ని ప్రశాంత్ గౌరవిస్తాడని.. అందుకే పోలీసులకు సహకరించాడని తెలిపారు. సోమవారం రోజు బెయిల్ మీద బయటకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. హౌస్ బయట ఏం జరుగుతుందో ప్రశాంత్‌కు ఎలా తెలుస్తుందని అడిగారు.
హౌస్ నుంచి బయటకు రాకముందే వాహనాలను ధ్వంసం చేశారని శివాజీ చెబుతున్నారు. దాడులు చేసింది ఎవరి అభిమానులో కూడా తెలియదని హాట్ కామెంట్స్ చేశారు. ఆ దాడితో అమర్ దీప్ ఫ్యామిలీ ఎంత బాధపడ్డారో తనకు తెలుసు అని చెప్పారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నానని వివరించారు. జరిగిన దానిలో ప్రశాంత్ తప్పేమి లేదని శివాజీ అన్నారు. ఎవరో చేసిన తప్పుకు ప్రశాంత్ బాధ అనుభవిస్తున్నారని తెలిపారు.