Kim Jong Un: అమెరికా, జపాన్ దేశాలకు కిమ్ వార్నింగ్
బాధ్యత లేకుండా అమెరికా సైనిక కూటమి చేస్తున్న బెదిరింపులను తాను తేలిగ్గా తీసుకోనని కిమ్ చెప్పారు. వసూంగ్-18 ఖండాంతర క్షిపణిని ప్రయోగించి అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు కీలక ఆదేశాలిచ్చినట్లుగా మీడియా కథనాలు వెలువడ్డాయి.
అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశాల నేతృత్వంలో సైనిక బెదిరింపులకు మరిన్ని ప్రతి చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకేలా రూపొందించిన ఆధునిక ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని కిమ్ జోంగ్ ఉన్ వీక్షించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం వసూంగ్-18 ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించిన విషయం తెలిసిందే.
ఈ ప్రయోగాన్ని కూతురుతో కలిసి కిమ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా తమ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుందో ఈ క్షిపణి చెబుతోందన్నారు. బాధ్యత లేకుండా అమెరికా సైనిక కూటమి చేస్తున్న బెదిరింపులను తాను తేలిగ్గా తీసుకోనని కిమ్ చెప్పినట్లు సమాచారం. వసూంగ్-18 ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ఆయుధంగా భావిస్తున్నట్లు కిమ్ తెలిపారు. ఈ క్షిపణి వల్ల అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని ఆ దేశ మీడియా కథనాలు వెలువడ్డాయి.
North Korean leader Kim Jong Un commemorated the 12th anniversary of his father's passing on Saturday, paying a visit to Kim Jong Il's final resting place at the Kumsusan Palace of the Sun in Pyongyang. Kim Jong Un's visit to Kumsusan mausoleum uncovers leadership changes. pic.twitter.com/ve0xImbFS7