ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయోమీథేన్ (Liquid biomethane) తో జపాన్ సైంటిస్టులు అద్భుతం చేశారు. ఆ లిక్విడ్‌ను ఉపయోగించి రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా నడిపించారు. దానికి సంబంధించిన పరీక్షలు కూడా విజయవంతం అయ్యాయని తెలిపారు. ఆవు పేడ నుంచి వచ్చే లిక్విడ్ ద్వారా రాకెట్‌ను నడిపినట్లు జపాన్ స్పేస్ స్టార్టప్ ఇంటర్ స్టెల్లార్ టెక్నాలజీస్ (ఐఎస్టీ) వెల్లడించింది.
Company Successfully Tests Rocket Powered by Liquid Biomethane.
హోకైడోలోని ‘హోకైడో స్పేస్‌పోర్ట్ లాంచ్ కాంప్లెక్స్’లో (Hokkaido Spaceport Launch Complex) సైంటిస్టులు ఈ పరీక్షలు చేపట్టినట్లుగా తెలిపారు. సాధారణంగా సాంప్రదాయ రాకెట్ ఇంజినట్లతో పోల్చితే లిక్విడ్ బయోమీథేన్ ఆధారిత రాకెట్ ఇంజిన్ల ఖర్చు చాలా తక్కువ అని ఐఎస్టీ తెలిపింది. రాకెట్ల ప్రయోగంలోనే ఇదొక అద్భుతమని తెలిపింది.
Japanese chemical manufacturing company Air Water has been working on creating liquid #biomethane from cow waste to be used as rocket fuel. https://t.co/mgvKY5h8A4