»Alert For Women Zero Tickets On Telangana Rtc Bus From Tomorrow
RTC MD Sajjanar: మహిళలకు అలర్ట్.. రేపటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్లో జీరో టికెట్లు
రేపటి నుంచి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో జీరో టికెట్ ను ప్రవేశపెట్టనున్నారు. స్థానిక ఐడెంటీ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ టికెట్ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (RTC MD Sajjanar) కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్(Zero Tickets) ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన సూచించారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం సజ్జనార్ వర్చువల్ గా సమావేశం అయ్యారు.
‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు @TSRTCHQ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో… pic.twitter.com/XgPKGPqtpf
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా పథకం అమలవుతోందని, ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్వేర్ను సంస్థ అప్ డేట్ చేసిందని సజ్జనార్ ప్రకటించారు. సాఫ్ట్వేర్ను టిమ్ మెషిన్లలో ఇన్స్టాల్ చేస్తున్నట్లు తెలిపారు. మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుందని వెల్లడించారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని, స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సజ్జనార్ సూచించారు.
హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం @TSRTCHQ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు (@SajjanarVC ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు.@revanth_anumula… https://t.co/iC65jkd8Xypic.twitter.com/rNtXfCSU5n