Rana Naidu is the only Indian title listed in the top 400 worldwide on Netflix
Rana Naidu: నెట్‌ఫ్లిక్స్‌లో ఇతర ఓటీటీలతో పోలిస్తే.. కాస్త క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమాలను ఉంటాయి. బోల్డ్వి కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది మొదటి 6 నెలల [జనవరి-జూన్] 2023లో అత్యధిక ప్రసారమైన షోలు , చిత్రాలకు సంబంధించిన అప్డేట్ను నెట్ ఫ్లిక్స్ షేర్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రసారం చేయబడిన టాప్ 400 వెబ్ సిరీస్‌లు, చిత్రాలను విడుదల చేసింది. దేశం నుంచి రానా నాయుడు మాత్రమే ఈ జాబితాలో ఉండటం విశేషం. రానా నాయుడు (Rana Naidu) 1.64 కోట్ల గంటలను గడిపినట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ అత్యధికంగా ప్రసారం చేయబడిన కంటెంట్ జాబితాలో ఇది ప్రపంచవ్యాప్తంగా 336 వ స్థానంలో ఉంది.
వెంకటేష్ తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ఇది. ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. బోల్డ్ కంటెంట్, ముఖ్యంగా వెంకీ నోటి నుంచి కొన్ని పదాలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి సీజన్ 2 కొనసాగుతోందని, జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని వెంకటేష్ ఇటీవల వెల్లడించారు. “2వ సీజన్లో తక్కువ బోల్డ్ కంటెంట్ ఉంటుంది, ఇది కామెడీ, యాక్షన్‌పై ఎక్కువ దృష్టి పెడుతుంది” అని వెంకటేష్ వెల్లడించారు.
812.1 మిలియన్ గంటల వీక్షించడంతో, అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ది నైట్ ఏజెంట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి మూడు అత్యంత ప్రజాదరణ పొందిన షోలు గిన్నీ & జార్జియా: సీజన్ 2, ఇది 665.1 మిలియన్ గంటలు, ది గ్లోరీ: సీజన్ 1, 622.8 మిలియన్ గంటలు. క్వీన్ షార్లెట్: ఎ బ్రిడ్జర్టన్ స్టోరీ, యు సీజన్ 4, ఔటర్ బ్యాంక్స్: సీజన్ 3 , మానిఫెస్ట్: సీజన్ 4 టాప్ 10లో ఉండటం విశేషం.