Animal ఫుల్ సాంగ్ వచ్చేసింది.. రోజుకి 20 కోట్లతో కొత్త రికార్డ్!
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ రణబీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయిర రెండు వారాలు కావొస్తున్నా కూడా 'యానిమల్' తగ్గేదేలే అంటోంది.
Animal: డే వన్ నుంచి భారీ వసూళ్లతో దూసుకుపోతునే ఉంది యానిమల్ (Animal) సినిమా. సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పాలనుకున్నాడో.. ఏ మాత్రం భయపడకుండా తెరపై చూపించాడు. బోల్డ్ సీన్స్ ఉన్నాయి, వైలెన్స్ ఎక్కువగా ఉంది, ఆడవాళ్లను కించపరిచేలా ఉంది.. అనే విమర్శలు వస్తున్న కూడా.. పది రోజుల్లోనే 717 కోట్లకు పైగా రాబట్టింది. ఓ A రేటెడ్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. సెకండ్ వీక్ మండే నుంచి ఈ సినిమా వసూళ్లు తగ్గుతాయని అనుకుంటే.. స్టడీగా ఉండడమే కాదు ట్రేడ్ వర్గాలకు కూడా షాక్ ఇచ్చేలా ఉన్నాయి. సెకండ్ మండే కూడా అనిమల్ సినిమా 20 కోట్లు కలెక్ట్ చేసింది. మండే వరకు ఓవరాల్‌గా 11 రోజుల్లో అనిమల్ సినిమా 737.98 కోట్లని కలెక్ట్ చేసింది. మంగళ వారం కూడా ఈ సినిమా 20 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా 12 రోజుల్లో 757.73 కోట్లు కలెక్ట్ చేసింది.
రోజుకి 20 కోట్లకు ఏ మాత్రం తగ్గడం లేదు యానిమల్ మూవీ కలెక్షన్స్. ఇది కొత్త హిస్టరీ అనే చెప్పాలి. బాలీవుడ్లో జవాన్, పఠాన్ తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది సినిమా. ఓవర్సీస్లో ఓ రేంజ్లో దూసుకుపోతోంది. యానిమల్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి పార్శీ సాంగ్ జమాల్ కుదు సోషల్ మీడియాను షేక్ చేస్తునే ఉంది. అబ్రార్‌గా బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో వచ్చిన ఈ పాట థియేటర్లను షేక్ చేస్తుంది. జమాల్ కుదు సాంగ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో ఇప్పటికే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. గంటలోనే మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ సాంగ్. బాబీ డియోల్ తల పై మందు గ్లాస్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సాంగ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది