»Victory Venkatesh Birthday 2023 Celebrities Wish Tweets Social Media
HBDVenkyMama: ఎన్టీఆర్ సహా ప్రముఖుల ట్వీట్స్
నేడు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు అభిమానులు, రాజకీయ నాయకులు సైతం తనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ మొత్తం వెంకీ మామ చిత్రాలతో హోరెత్తిపోతుంది.
victory venkatesh birthday 2023 celebrities wish tweets social media
దగ్గుబాటి వారసుడిగా వెంకటేష్(venkatesh) టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. మొదట్లో పూర్తి యాక్షన్ చిత్రాలే చేశాడు. కానీ ఆ తర్వాత కుటుంబ, ప్రేమకథా చిత్రాలకు వెంకీ కేరాఫ్ ఆడ్రస్ గా మారిపోయారు. ఆ తర్వాత హాస్యాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకుని మరికొన్ని చిత్రాల్లో యాక్ట్ చేశారు. దీంతోపాటు కామెడీ, లవ్, ఫ్యామిలీ జోనర్లలో వెంకీమామ సాధించినన్ని ఎవర్గ్రీన్ బ్లాక్‌బస్టర్స్ మరే హీరో సాధించలేదని చెప్పవచ్చు. టాలీవుడ్ వరకు ఇదోక అరుదైన రికార్డు. అయితే నేడు (డిసెంబర్ 13) వెంకీ మామ పుట్టినరోజు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు తనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకీమామ సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలను తెలుసుకుందాం.
Happy Birthday @VenkyMama!
May your versatility continue to entertain us, and may you be blessed with good health and prosperity.
వెంకటేష్ 1986లో కమర్షియల్‌గా విజయవంతమైన కలియుగ పాండవులుతో అరంగేట్రం చేశారు. శ్రీనివాస కళ్యాణం (1987), బ్రహ్మ పుత్రుడు (1988), ప్రేమ (1989), ధృవ నక్షత్రం (1989), పొప్పిలి రాజా (1990), క్షణ క్షణం (1991) వంటి బాక్సాఫీస్ హిట్లను అందించారు. ప్రేమకథల్లో ప్రేమించుకుందాం.. ఫ్యామిలీ కలిసుందాం రా.. కామెడీ జానర్లో నావ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలు వెంకీమామ ఖాతాలో ఉన్నాయి. వెంకీ మామ సినిమాల్లో ఎంత జాలీగా, పాజిటివ్ గా ఉంటాడో.. బయట కూడా అలాగే ఉంటాడు. ఆయన ఎలాంటి వివాదాల జోలికి వెళ్లరు. వెంకీ మామ కాంపౌండ్‌లోకి ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు లేకపోవడం విశేషం.
అంతేకాదు అతని కుటుంబం కూడా ఎప్పుడూ బయట పెద్దగా కనిపించదు. తన సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా ఉంచుకుంటాడు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. విధిని నమ్మి, మనకోసం ఏది రాస్తే అది వస్తుందని నమ్మే సానుకూల వ్యక్తి మన వెంకీమామ. ఎన్ని విజయాలు, అపజయాలు వచ్చినా ఒక్క అంగుళం కూడా మారకుండా ప్రతి విషయాన్ని చిరునవ్వుతో అంగీకరిస్తారు.
ఎప్పుడూ భగవంతుని గురించి ఆలోచిస్తారు. రమణ మహర్షికి ఆశ్రమం గురించి చెప్పడానికి ఆసక్తి ఎక్కువ. తాను కర్మను నమ్ముతానని చెప్పారు. స్టేజ్‌పైనా, ఇంటర్వ్యూలలో మాట్లాడినా వెంకీ మామ ఎప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడతారు. ఎలాంటి ఇగో లేకుండా.. అందరితో కలిసి నటిస్తాను. అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటానని అంటున్నాడు. మంచి కథ వస్తే ఎలాంటి పాత్రనైనా చేస్తానని అంటున్నాడు. కొత్త దర్శకుడా? చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అని చూడనని అంటున్నాడు. కథ బాగుంటే చేస్తానని అంటున్నారు.
ప్రస్తుతం వెంకీ మామ సైంధవ్(saindhav) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. కెరీర్లో 75వ సినిమా కావడంతో సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలన్నీ సినిమాపై ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వెంకీ మామ అభిమానులే కాకుండా, సినీ అభిమానులందరూ సైంధవ్ సంక్రాంతికి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు.