»Telangana Government Will Work To Close The Belt Shops
Belt Shops: తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు.. క్లోజ్ చేయకపోతే క్రిమినల్ కేసులు
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే బెల్టు షాపుల బంద్కు ప్రభుత్వం పూనుకుంది. గ్రామాల్లో బెల్టుషాపులతో యువత మద్యానికి బానిసలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిచింది.
Belt Shops: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే బెల్టు షాపుల బంద్కు ప్రభుత్వం పూనుకుంది. గ్రామాల్లో బెల్టుషాపులతో యువత మద్యానికి బానిసలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిచింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని బెల్ట్ షాపులను మూయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. రాష్ట్రంలో బెల్టు షాపులను మూసివేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చింది. మేనిఫెస్టో ప్రకారం రాష్ట్రంలో బెల్ట్ షాపుల మూసివేతకు కసరత్తు మొదలైంది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్స్ ఉండగా, వైన్ షాపులతో పాటు గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 6 నుంచి 10కి పైగా బెల్టు షాపులు ఉన్నాయి. రాష్ట్రంలో సగటున 10 వేలకు పైగా బెల్టు షాపులు ఉన్నాయి. బెల్టుషాపుల్లో 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో యువత మద్యానికి బానిసలవుతున్నారని, బెల్టుషాపుల యజమానులు అక్రమంగా నిర్వహిస్తున్నారని ప్రభుత్వం బెల్టుషాపులను మూసివేయాలని నిర్ణయించింది. బెల్టు షాపులను మూసివేయకుంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నిస్తుందన్నారు. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా ఇటీవల బెల్టుషాపులు మూతపడ్డాయి. గ్రామాల్లో బెల్టుషాపులను తొలగిస్తే ప్రభుత్వానికి ఏటా రూ.16 వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.